Thursday, September 25, 2008

Great Naidu's History
















చారిత్రకంగా కాపు – ఉపకులాలు, వర్గాలు
కాపులు కాంపిల్య నగరం నుంచి వచ్చి ఉండవచ్చు అందుకే వీరి పూర్వపు శాసనాలలో వీరిని కాంపులు అని వ్రాసారు అని చరిత్రకారులు అన్నారు.. అది ఎంతవరకు నిజమో గాని..
కాకతీయుల కాలంలో 12వ శతాబ్దినాటికి కాపు అంటే కమ్మ, వెలమలు కూడా కలిసిన వర్గం …(ఇందులో ఆనాటికే ఉన్న బలిజ, తెలగ, ఒంటరి సామాజికవర్గాలు కలిసిలేవు.) కానీ కాకతీయుల తరువాత కమ్మ, వెలమ వర్గాలు నాటి కాపులనుండి విడిపోయి ప్రత్యేకమైనాయి…అప్పటికి మిగిలిన కాపు సముదాయంలోని వారే 1930 ల నుండి రెడ్లుగా చెప్పుకోబడుచున్న కాపువారు. వీరిలో మిగిలిన వర్గం కృష్ణ నదికి పైన ఉన్న తీరాంధ్ర ప్రాంతంలో “కాపు” కులస్తులు గానే ఉండగా, వీళ్ళందరూ కలిసి 1871 జనాభా లెక్కలు ప్రకారం 19.88 లక్షలమంది ఉంటె 1921 ల నాటికి మద్రాస్ ప్రెసిడెన్సీలోనే 26 లక్షలు జనాభా ఉన్నారు.. (1930 నాటికి కూడా బలిజ, తెలగా, ఒంటరి కులాలవారు ఈవర్గానికి సంబంధం లేనివారిగానే 1871 నుండి 1931 వరకు చేయబడిన సెన్సస్ రిపోర్ట్ ల లో ప్రకటించుకున్నారు).. ఈ కాపులలోని వారే 14వ శతాబ్దినాటికే రెడ్డిరాజుల కాలంలో ప్రాంతాలవారీగా పంటకాపు, పాకనాటికాపు, పెదగంటికాపు, కొండేటికాపు, మొరసకాపు, మోటాటికాపు, అయోధ్యకాపు, భూమంచి కాపు, దేసూరికాపు, కొడిదెకాపు, గోదాటికాపు, నేరటికాపు, ఓరుగంటికాపు, పోకనాటి కాపు, మున్నూటికాపు అని పంట 14 వర్గాలనే విభజన కాపులలో జరిగింది…… వీరిలో అనేక ఉపకులాల ఉన్నట్టు ఆకాలంలో రికార్డు చేయబడినది… ఇంకా వెలనాటికాపు, పొంగలనాటికాపు, పల్లెకాపు, కుంచెటికాపు, గండికోటకాపు, కమ్మపురికాపు, ఆది కాపు, అల్లూరికాపు, అరవకాపు, ఆరేకాపు, ఆకుతోటకాపు, ఆగముదికాపు, అర్లంకాపు, బండదేవరకాపు, బుడకాపు, దోసకాపు, దొమ్మరకాపు, గోరింటకాపు, గొడుగులనాటికాపు, కన్నడికాపు, కొప్పులకాపు, కోయిలంకాపు, కొదురుకాపు, కొండకాపు, కాసనాటికాపు, కాపుదొరలు, నందిమండలంకాపు, పెద్దేటికాపు, రెడ్డిసానికాపు, తుడుంకాపు, మజ్జికాపు, అయ్యరికకాపు, కచ్ఛకట్టుకాపు ఇలా ఇంకా చాలా తెగలు కాపులలో ఉన్నాయి… నిన్న మొన్నటి వరకూ రాయలసీమ, తెలంగాణా, కోస్తా ఆంద్రా ప్రాంతాలలో కాపులు గా పిలువబడిన వీరిలో చాలామట్టుకు నేడు రెడ్లు అని పేరుచివర పెట్టుకుని అదే తమ కులంగా పిలుచుకుంటున్నారు.. రెడ్డి అని పెట్టుకున్నప్పటికీ తరతరాలుగా వీరు కాపు కులం వారిగా కులం సర్టిఫికెట్స్ నందు కలిగి ఉంటూ, వంశవృక్షాలు కలిగి ఉన్నందున వీరు “కాపు” కులం వారే అవుతారు గాని మరొకరు కాదు…. వీరందరూ తరతరాలుగా వేల సంవత్సరాలనుండి భూమిని నమ్ముకుని వ్యవసాయము మీద ఆధారపడిన వర్గం… గ్రామాలకు పెదకాపులు, కాపులు, రెడ్డి జమిందారులు, రెడ్డిరాజులు మాత్రమేకాదు, తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా ఇప్పటివరకూ సేవలందించిన బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, భవనం వెంకట్రాంరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి, వైస్ రాజశేఖరరెడ్డి, నల్లారి కిరణకుమార్ రెడ్డి వంటివారెందరో ఈ కాపు కులం నుండి ముఖ్యమంత్రులుగా పరిపాలించినవారే…..గుంటూరుజిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, మరియు తెలంగాణ జిల్లాలోనూ, మరియు ఉత్తర తీరాంధ్ర జిల్లాలలోనూ వీరు విస్తృతంగా ఉన్నారు.. వీరందరి కుల సర్టిఫికెట్స్ దస్తావేజులు వీరిని కాపులు అనే అంటున్నాయి… వీరెవరూ కూడా తరతరాలుగా రాయలసీమ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ఉన్న బలిజవారిని, తెలగాలను – కాపులు అని పిలిచేవారుకాదు.. బలిజవారుకూడా రెడ్డి కులస్తులుగా మారి ఉన్న వీరినే కాపులు అని పిలుస్తారు… వాళ్లకూ వీళ్లకూ ఎక్కడా కూడా వివాహ సంబంధాలు వంటివి ఏనాడూ లేవు.. . (ఈ కాపు వాళ్ళెవరూ బలిజ, తెలగ, ఒంటరి కుల సముదాయానికి చెందినవారు కాదు)
చారిత్రకంగా బలిజ – ఉపకులాలు, వర్గాలు
బలిజలు ఆర్యావర్తనంలోని అహిచ్ఛత్రపురము నుండి దక్షిణాపథమునకు వచ్చినవారము అని తమచే వేసుకోబడిన అనేక శాసనాలలో చెప్పుకుంటూ వచ్చినారు… వీరు నేటి కర్ణాటకలోని ప్రపంచప్రసిద్దిగాంచిన మరియు చాళుక్య వంశీయులకు తొలిరాజధానిగా వర్ధిల్లిన ఐహోలు అనే ఆర్యాపురం ముఖ్య కేంద్రముగా దక్షిణాది అంతా విస్తరించారు.. .. దీనినే అయ్యావళి అని పిలిచేవారు… వీరు అహిచ్ఛత్ర పురవరాధీశ్వరులు, అయ్యావళి పురవరాధీశ్వరులు అని పేర్కొనబడేవారు .. 56 దేశాలవారు అని పిలువబడేవారు… మహాజనులు అని పిలువబడేవారు.. 56 దేశాలలోనూ, 9 ఖండాలలోనూ అపారమైన “వ్యాపారాలు” చేసేవారు… గొప్ప గొప్ప నావికాదళాలతో తూర్పుదేశాలలో వలస వ్యాపార స్థావరాలు ఏర్పాటుచేసుకొనెను.. వీర బలిజ సమయ ధర్మ ప్రతిపాలకులు, అన్నికులాలకు కులపెద్దలుగా వ్యవహారాలూ చక్కబెట్టే పెద్దరికం కలిగినవారు.. కులపెద్దలుగా బలిజ మహానాడులు నిర్వహించేవారని శాసనాలలో పేర్కొన్నారు. వీరినే గౌరీదేవి పేరుమీద గౌరీపుత్రులు అనీ, గవరై, కవరై అని పిలిచేవారు. యజ్ఞ సంభవులవుట వలన “బలిజలు” అని పిలువబడినారు, దైత్య చక్రవర్తి బలి మహారాజు పేరుమీద ఆతని సంతతులు “బలిజలు” అని కూడా పిలువబడినారు, చంద్రవంశ బలి మహారాజు పేరుమీద ఆతని సంతతులు “బలిజలు” అని పిలువబడినారు, యదువంశ బలరాముని పేరుమీద ఆతని సంతతులు “బలిజలు” అని పిలువబడినారు. సూర్య, చంద్ర, యదు, నాగ వంశాలవారు తరువాత “బలిజవారు” గ పిలువబడినారు. చాళుక్య, చోళ, పల్లవ, హైహయ, హొయసల, కాకతీయ వంటి రాజ వంశ సంతతులు కూడా బలిజవారిలో కలిసి క్షత్రియ బలిజ వారిగా పేర్కొనబడినారు.. ఈ విధంగా బలిజవారు తరతరాలుగా వేల సంవత్సరాల నుండి వ్యాపార వాణిజ్యాలతో బాటు రాచరిక పరిపాలనలలో నిమగ్నమై ఉన్న వర్గం అని చరిత్ర ఉన్నది….. వీరినే తమిళనాడులో “కవరై” అని, కర్ణాటకలో “బనజిగర్” అని కూడా అంటారు…ఉత్తరాదిన “బనియా”, “వనియా” అనీ అంటారు…. ఈ పేర్లన్నీ “వణిజ” అనే మూల సంస్కృత పదమునుండి వచ్చినవి.. వీరు ఋగ్వేదం, రామాయణం, మహాభారతం వంటి పురాణ గ్రంధాలలోను, జైన, బౌద్ధ వాఙ్మయాలలోనూ వర్ణించబడినారు.. వీరు 56 దేశాలలో ఆయా దేశాల పేర్లతో కూడా పిలవబడతారు.. కన్నడ ప్రాంతం వారు “కన్నడ బలిజ” అని, తమిళ ప్రాంతం వారు “ఆరవ బలిజ” అని, తెలుగు ప్రాంతం వారు “తెలుగు బలిజ” లేదా “తెలగబలిజ” అని పిలవబడ్డారు.. ఈ బలిజవారిలో అనేక ఉప కులాలు వర్గాలు ఉన్నాయి… వాటిలోకొన్ని: రాచబలిజ, క్షత్రియబలిజ, తుర్వ బలిజ, తుళువ కవరై, రాహుతబలిజ, ఒప్పనకారబలిజ, ముసుగుబలిజ, రత్నాలబలిజలు, తెలగబలిజ, పట్టణశెట్టి, పట్టణస్వామి, వలయాలసెట్టి, గాజులబలిజ, గంధంబలిజ, పువ్వులబలిజ, బలిజిగ, బందరుకవరై, కవరై వడుగన్, లింగమండికవరై, కవరై చెట్టి, రాయదుర్గంబలిజ, కాంచిపురంబలిజ, వక్కలబలిజ, ఉప్పుకవరై, నాయుడు, అరవబలిజ, ఆకుబలిజ, బలిజశెట్టి, బుట్టిబలిజ, పెరికబలిజ, బలిజనాయుడు, దూదిబలిజ, ఏనూటిబలిజ, గవరబలిజ, గండవరంబలిజ, కుల్లూరుబలిజ, గోపతిబలిజ, గోనుగుంటబలిజ, గుగ్గిళ్ళబలిజ, మిరియాలబలిజ, గురుబలిజ, గోరిబలిజ, గౌరబలిజ, కొండేటిబలిజ, లింగబలిజ, మహతడిబలిజ, నీలిబలిజ, పెదకంటిబలిజ, పాటిబలిజ, పలాసకవరై, పగడాలబలిజ, రాజమహేంద్రవరంబలిజ, శెట్టిబలిజ, తోటబలిజ, తొగరుబలిజ, ఆదిబనజిగ, జైనబణజిగ, సజ్జనబలిజ, లింగాయత బలిజ, దాసబలిజ, విజయనగరంబలిజ, పెనుకొండబలిజ, చంద్రగిరిబలిజ, గంజాముబలిజ, ఓరుగంటిబలిజ, దేశాయిశెట్టి, మహానాటిబలిజలు, ముత్యాలబలిజలు, రాళ్ళ బలిజలు, కండీబలిజలు, కొయిలడిబలిజలు, మహాజనబలిజ, చిత్రాలబలిజ, పత్తిబలిజ, జనపబలిజ, ఓడబలిజ, వలసబలిజ, పూందమల్లిబలిజ ఇలా ఇంకా ఇంకా ఎన్నో ఎన్నెన్నో బలిజ ఉప కులాలు ఆంద్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒరిస్సా, మహారాష్ట్ర, ఉత్తరభారతం, శ్రీలంక లలో ఉన్నాయి… చాళుక్య, చోళ, పల్లవ, కాకతీయుల కాలాలలోనే వీరిని బలిజలుగా పేర్కొన్నారు …విజయనగర కాలంనాటికి అపారమైన సంపదలతో ఎంతో గొప్ప వైభవ జీవితాలను చవిచూసిన వీరు, విజయనగర పతనం తరువాత జరిగిన అనేక రాజకీయ సామాజిక మార్పులతో అపార సంపదలు హరించుకుపోగా, వీరిలో కొందరు తెలుగు ప్రాంతములో ముఖ్యంగా “గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, గంజాం” జిల్లాలలో – తెలగాబలిజలుగా , తెలగాలుగా కూడా పిలుచుకొనుచూ సైనిక, వ్యాపార జీవనం సాగిస్తూ రానురానూ సైనిక, వ్యాపార అవకాశాలు తగ్గటంతో వాటిని వదిలి గ్రామీణ ప్రాంతాలలో 18వ శతాబ్దం నుండి భూస్వాములుగా, తరువాత వ్యవసాయదారులుగా స్థిరపడుతున్న క్రమంలో వీరిలో కొందరు గ్రామాలలో పెద్దలుగా ఉంటూ పెద్దకాపు (మునసబు)లుగా పిలువబడుతూ వ్యవసాయం చేస్తూ కాపు అని పేరుతొ కూడా పిలువబడినారు. వీరు తప్ప మిగతా దక్షిణభారతదేశములో అంతటా విస్తరించి ఉన్న వీరి కుల వర్గం వారందరూ బలిజ వారు అని మాత్రమే పిలవబడుచూ చరిత్ర కలిగి ఉన్నారు… ఈ బలిజవారు 1871 నాటి జనాభాలెక్కలు ప్రకారం 10.29 లక్షలు ఉంటె 1921నాటికి 10.40 లక్షలు పైబడి జనాభా కలిగిన కులము.. వాస్తవానికి వీరు పూర్వమునుండి ఆంధ్ర దేశం లో ఉన్న కాపు-రెడ్డి కుల సముదాయమునకు చెందినవారు కూడా కాదు…. అప్పటికి ఈ గోదావరి జిల్లాలలో కాపులతో ఈ బలిజలు వైవాహిక సంబంధాలు అసలు లేవు.. ఉన్నా అక్కడక్కడ మాత్రమే కులాంతర వివాహాలుగా జరుగుచుండేవి… గత 100 సంవత్సరాల ఆధునిక కాలంలో తప్పితే, అంతకు ముందు ఏ కాలంలోనూ వీరు బలిజ చరిత్రలలో గాని, కాపు చరిత్రలలో గాని కాపు సముదాయము వారిగా శాసన, సాహిత్య పరమైన ఆధారాలు కూడా లేవు… 15వ శతాబ్దం నుండి విజయనగరం, మదురై, తంజావూరు, కండి, జింజి, చంద్రగిరి, ఉదయగిరి, బేలూరు, పెనుకొండ, కేలడి వంటి రాజ్యాలను పరిపాలించినవారు ఈ బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు….వారి సంతతివారందరూ బలిజలుగానే ఉన్నారు…
తెలగ, ఒంటరి అనేది మిక్కిలి పౌరుషవంతంగా ఉంటూ తరతరాలుగా ఆయుధోప జీవులుగా వర్ధిల్లిన వర్గం… చోళుల, పల్లవుల, చాళుక్యుల, కాకతీయుల కాలంలో వీరిని తెలుంగులుగా పేర్కొన్నారు…. తెలుగు చోళ, తెలుగు పల్లవ, తెలుగు చాళుక్య, హైహయ, దుర్జయ వంశ సంతతులవారే తెలగాలు అని చెరిత్ర చెబుతుంది… చాళుక్య పులకేశి వెంట వీరవిహారం చేసిందీ, రామప్రమార వెంట వీర విహారం చేసిందీ, కర్ణాటకలోని కంపిలి రాజ్యంలో వీరవిహారం చేసిందీ, జల్లిపల్లి యుద్దములో పద్మనాయకులకు తోడుగా ఉండి వీరవిహారంచేసినారు, బొబ్బిలియుద్ధంలోకూడా పద్మనాయకులవెంట ఉండి వీరవిహారంచేసినది ఈ తెలగాలే… మద్రాసులోనూ, మైసూర్ లోనూ, బెంగాలులోనూ, పూనాలోనూ, ఉత్తరభారతదేశములోనూ ఫ్రెంచి, డచ్చి, బ్రిటిష్ సైన్యాలలో ఉండి వీరవిహారంచేసినది ఈ తెలగాలే…. తీరాంధ్రలో “గుంటూరు, కృష్ణ, గోదావరి, విశాఖ, శ్రీకాకుళ, విజయనగర గంజాము” జిల్లాలలోనూ, తెలంగాణాలోనూ విస్తరించి ఉన్న వీరు 1871 జనాభా లెక్కల ప్రకారం 4.00 లక్షలు ఉంటె 1921 దశకంనాటికే 6లక్షల జనాభా మద్రాసు ప్రెసిడెన్సీలో గల వర్గం. తెలంగాణాలో మరో 4.5 లక్షల జనాభా కలిగిన కులం “తెలగాలు”. వీరు తరతరాలుగా “సైనిక జాతి”గా పేరొంది తెలగాలమనే పౌరుషనామంతో పిలవబడినారు.. వీరిలో తరతరాలుగా రాచరిక పోకడలతో ఉండే ఘోషా సాంప్రదాయం చాలా ఎక్కువ.. ఈ తెలగాలలో రాచతెలగా, బొబ్బిలితెలగా, తెలగ దొర, హజారీ తెలగ, ఈటె తెలగ, వంటర్లు, నాయుడు, అరవతెలగా, గంప తెలగ, మూల తెలగ వంటి అనేక శాఖలు ఉన్నాయి.. వీరుకూడా సైనిక జీవనాన్ని వదిలి 1890 నుండి గ్రామీణ ప్రాంతాలలో భూస్వాములుగా, వ్యవసాయదారులుగా స్థిరపడుతున్న క్రమంలో వీరిలో కొందరు గోదావరి జిల్లాలలో గ్రామాలలో పెద్దలుగా ఉంటూ పెద్దకాపు (మునసబు) లుగా పిలవబడుతూ వ్యవసాయం చేస్తూ కాపులు గా కూడా పిలువబడినారు గాని వాస్తవానికి వీరు పూర్వమునుండి ఆంధ్ర దేశం లో ఉన్న కాపు సముదాయమునకు చెందినవారు కాదు…. గత 100 సంవత్సరాల ఆధునిక కాలంలో తప్పితే, అంతకు ముందు ఏ కాలంలోనూ వీరు కాపు కులస్తులుగా, కాపు కులం నుండి ఉద్బవించినవారుగా, కాపు-రెడ్డి సముదాయము వారిగా శాసన సాహిత్య పరమైన ఆధారాలు లేవు…వీరి కుల చరిత్రలో కూడా ఆవిధంగా ఎక్కడా చెప్పుకోలేదు…. ఇంకా ఈ తెలగ, ఒంటరి వారిలో విజయనగరం పతనం తరువాత వ్యాపార సైనిక వర్గమైన బలిజవర్గీయులు అనేక వేలమంది కలిసిపోవడంతో, బలిజ వర్గంతో మాత్రమే తరతరాలుగా వివాహ సన్నిహితానుబంధాలు ఉంటూ ఉన్నవి.. .వీరిని తెలగాబలిజలు అనికూడా అనడం గలదు.. రాయదుర్గం బలిజవంశీయులు, బారామహలు చెన్నపట్టణ రాజ్యాధీశులగు రాణా జగదేవరాయల వంశీయులు ఈ తెలగ బలిజ లేదా ముసుకుబలిజ వర్గం వారే.. 100 సంవత్సరాలకు పూర్వం స్థానికంగా ఈ జిల్లాలలో ఈ బలిజ, తెలగ, ఒంటరి వర్గము వారికీ కాపులకు వివాహ సంబంధాలు లేవని, అప్పుడప్పుడే అక్కడక్కడా మోతలవుతున్న ఈ కులాంతర వివాహాలలో ఒకవేళ చేసుకోవలసి వస్తే ఒక బీద తెలగ కులస్తుడు ఎవరైనా ఒక ధనిక కాపు స్త్రీని వివాహం చేసుకోగలిగేటంతటి సామాజిక అంతస్తు వీరిమధ్య ఉండేదని అటువంటప్పుడు ఆ కాపుల ఇంటి నుండి పెద్దమొత్తం కట్నం తీసుకుని చేసుకునేవారు కానీ తమ బలిజ, తెలగ, ఒంటరి కులం స్త్రీని కాపు వారింటికి ఇచ్చే ఆచారం కూడా లేదు అనేది కూడా కుల పెద్దలు చెప్పుచున్న మాట ..
కానీ నేడు కొందరు అజ్ఞానంతో మిడిమిడి జ్ఞానంతో పూర్వపు కుల చరిత్రలు, వంశ చరిత్రలు పరిశీలించకుండా వాటిని నాశనం చేస్తూ వ్రాస్తున్నదేమిటంటే….. ఇలా వృత్తిరీత్యా తాత్కాలికంగా 100 సంవత్సరాలనుండి కాపు అని కూడా చెప్పుకోబడుతున్న గుంటూరు, కృష్ణ, గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం గంజాము జిల్లాలలో ఉండే బలిజ, తెలగ, ఒంటరి కులాల వారి మూలాలు అర్ధంచేసుకోకుండా చెరిపేసి, వీరూ కాకతీయులకాలంనుండీ లేదా అంతకన్నా పురాతనకాలంనుండీ స్థానికంగా ఉంటూ వ్యవసాయాలు చేసుకునే కాపులనుండే ఈ బలిజ, తెలగ, ఒంటరి కులాలు ఏర్పడ్డారనే తప్పుడు అపోహలతో కాపులు ఉంటూ పిచ్చిపిచ్చి రాతలతో, కల్పిత కథనాలతో కాపు అనేదే వీరందరికి మూల కులము అని, కాపు మహా వృక్షానికి బలిజ, తెలగ, ఒంటరి కులాలు ఉపకులాలని తప్పుగా 80 దశకం నుండి తప్పుడు చరిత్రలు వ్రాస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు… కాపుకులం అని, కాపునాడు అని, కాపు మహాసభ అని, కాపురాక్స్ అని, కాపువెల్ఫేర్ అని, కాపుచరిత్ర, కాపుమిత్ర అని ఇలా ప్రతిచోటా తమకు తరతరాల ఉన్నటువంటి చరిత్రతో సంబంధంలేని పేరులుపెట్టి దానికి బలిజ, తెలగ, ఒంటరి వర్గాలు ఉపకులాలు అని – చరిత్రకు విరుద్ధంగా, చరిత్రలో కాపులకు ఇవి ఉపకులాలు కాకపోయినా కూడా లేనిదానిని చూపుతూ ఈ మూడింటికీ మూలమై ఉన్న “బలిజ సామాజిక వర్గ చరిత్ర”ను రూపుమాపు చేస్తూ అదంతా “కాపు చరిత్ర” అని తప్పులతడకలుగా మార్చివేసి “బలిజకులానికి” మిక్కిలి అవమానం చేస్తున్నారు…
ఈరోజు ఆర్ధికంగా చితికిపోయి పేదరికము అనుభవిస్తున్నప్పటికీ మనమందరమూ కాపులము అని మాత్రమే చెప్పజూపుతూ, బలిజ అంటే ఏమిటో తెలియదు, తెలగ అంటే ఏమిటో తెలియదు, ఒంటరి అంటే ఏమిటో తెలియదు అని చెప్పుకునే దుస్థితిలోకి రానవసరం లేదు….. దాని వలన మనదైన చరిత్ర మరొకరి సొత్తుగా మారగలదు…. మార్చుకుంటున్నారు కూడా…




Kapu Naidu's Surnames

Aalla Abburi Abbisetty  Abbisetti Abbireddy Alakamsetty Areti Ariga Aarisetty Achukola Achanta Achuta Adabala Adagarla  A...